కరోనా 2వ దశ పై అవగాహన కార్యక్రమం
విశాఖ తూర్పు, పెన్ పవర్
సీతమ్మదార రైతు బజారు వద్ద మంగళవారం ప్రజారోగ్య వేదిక మరియు ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ సంయుక్తంగా కరోనా 2వ దశ పై అవగాహన కార్య్రక్రమం మరియు కరపత్రం పంపిణీ జరిగింది.ఈ కార్యక్రమంలో పి.ఏ.వి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు మాట్లాడుతూ కోవిడ్ 2 చాలా ప్రమాద కరమైనదని దీనికి లక్షణాలు కూడా కనిపించవు అని వచ్చిన 3 రోజులలోనే చెయ్యి దాటిపోయి ప్రమాదం ఉందని దీనికి మందులేదని ఏస్.ఎమ్.ఏస్,మాత్రమే నివారణ అని తెలియచేస్తూ (ఏస్) అంటే శానిటేషన్(ఎమ్ ) అంటే మాస్క్(ఏస్ ) అంటే సోషల్ డిస్టెన్స్ ఇది వాక్సిన్ వేసుకున్నా పాటించాలని తెలియచేశారు పి.పి.సి,రాష్ట్ర కమిటీ సభ్యులు చంద్రమౌళి మాట్లాడుతూ ప్రభుత్యం చొరవ తీసుకొని ప్రతీ ఒక్కరికీ మాస్క్ లు మరియు ఉచితంగా ఇవ్వాలని ప్రతీ వారు ఏస్.ఎమ్ఏస్,పాటించే విధంగా చొరవ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏ.పి.ఎమ్.ఏస్.అర్.యు,నాయకులు చంద్రశకర్, సంజయ్, సంతోష్ మురళి. ఎన్.జి.ఓ, నాయకులు రమణారెడ్డి, సివనగేశ్వరావు, కృష్ణ ,శ్రీను ,మహిళా నాయకులు కుమారి తదితరులు కరపత్రాలు పంచి ప్రజలకు జాగృతం చేశారు.
No comments:
Post a Comment