Followers

గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో లబోదిబోమంటున్న జిల్లా వాసులు

 గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో లబోదిబోమంటున్న జిల్లా వాసులు                   

  సూర్యాపేట, పెన్ పవర్

సూర్యాపేట జిల్లాలో వంట గ్యాసు వాణిజ్య సిలిండర్ ధర పెంచడంతో మధ్యతరగతి వారు లబోదిబోమంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో మళ్లీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచేశారు. వంటగ్యాస్‌ ధరలు మరోసారి షాక్‌ ఇచ్చాయి. వంటగ్యాస్‌తో పాటు వాణిజ్య సిలిండర్‌పై ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వంటగ్యాస్‌పై రూ. 25, వాణిజ్య సిలిండర్‌పై రూ. 95 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి చమురు సంస్థలు. వంటగ్యాస్‌పై డిసెంబర్‌ 1 నుంచి ఇప్పటి వరకు రూ. 225 పెంచారు. డిసెంబర్‌ 1న సిలిండర్‌ ధర రూ. 594 నుంచి రూ. 644కి పెంచారు. ఆ తర్వాత జనవరి 1న రూ. 644 నుంచి రూ. 694కు పెంచగా. ఫిబ్రవరి 4న మరోసారి రూ. 644 నుంచి రూ. 719 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15న రూ. 50 పెంచడంతో 769కి పెరిగింది. ఇక ఇటీవల ఐదు రోజుల వ్యవధిలో తాజా పెంపుతో కలిపి రెండు సార్లు వంటగ్యాస్‌పై రూ. 25 వడ్డించారు. దీంతో ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ. 819కి చేరింది. వాణిజ్య సిలిండర్‌ పైనా రూ. 95 పెరగడంతో. ఒక సిలిండర్‌ ధర రూ. 1614 కు చేరింది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...