Followers

భక్తులు మాస్కులు ధరించాలి: కలెక్టర్

 నేటి నుండి రెండో విడత కోవిడ్ వ్యాక్సి నేషన్ : కలెక్టర్                     

సూర్యాపేట, పెన్ పవర్

జిల్లాలో రెండో దశ కోవిడ్ -19 వ్యాక్సిన్ కార్యక్రమం నేటి నుండి (1. 3. 2021) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలకు అనుగుణంగా కరోనా టీకా కార్యక్రమం ప్రారంభించామని సోమవారం విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా పేర్కొన్నారు. ఈ రెండో దశలో 60 సంవత్సరాలు పైన పడిన వారు, 45 నుండి 59 సంవత్సరాలు వయస్సు కలిగి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అర్హులని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తమ వైద్యునితో తమ వ్యాధి గురించి ధ్రువీకరణ పత్రాన్ని పొంది ఉండి, వ్యాక్సిన్ వేయు ఆరోగ్య కేంద్రం వద్ద సమర్పించవలసి ఉంటుందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొరకై ప్రతి ఒక్కరూ ముందుగా COWIN పోర్టల్ నందు తమ పేరును, ధ్రువీకరణ పత్రాన్ని ఆన్లైన్ నందు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.పేరు రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాక్సిన్ వేయటానికి నిబంధనలు అనుమతించవు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ సాఫ్ట్ రన్ కార్యక్రమం జిల్లాలో సోమవారం అనగా 01. 03. 2021నుండి ముందుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు రెండు వందల మందికి, విజయ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (ప్రైవేటు) నందు వంద మందికి ఇచ్చేందుకు అనుమతి కలదు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవలిసిందిగా కోరనైనది. ప్రైవేటు ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకునేవారు వ్యాక్సిన్ కొరకు 150 రూపాయలు, 100 రూపాయలు సర్వీస్ ఛార్జీలు మొత్తంగా ఒక్క డోస్ కొరకు 250 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించి కరోనా మార్గదర్శకాలను పాటించవలసి ఉంటుంది. వ్యాక్సిన్ పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకొని వ్యాధి బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు అని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...