Followers

ఎ.వి.ఎన్, కళాశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

 ఎ.వి.ఎన్, కళాశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం 




మహారాణి పేట, పెన్ పవర్


మిసెస్ ఎ.వి.ఎన్, కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.కళాశాల పూర్వ విద్యార్థి మరియు నోబెల్ గ్రహీత సర్. సి.వి. రామన్. కనిపెట్టిన రామన్ ప్రభావమునకు గుర్తుగా 28 ఫిబ్రవరి జాతీయ సైన్స్ దినోత్సవముగా  జరుపుకోవడం చాలా సంతోషకరమని కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సి.హెచ్.మధుసుధనరావు తెలిపారు. సైన్స్ ప్రయోగాల యొక్క ఆవశ్యకత మరియు సైన్స్ యొక్క పరిజ్ఞానం పెంపొందించుకోనుట ఇప్పటి పరిస్థితులలో, ఎంతైనా అవసరమని ఫిజిక్స్ విభాగాధిపతి మరియు వైస్ ప్రిన్సిపల్ ఆచార్య. ఏస్. శ్రీనివాసు రావు తెలిపారు. రామన్ యొక్క ప్రయోగాలు మరియు ఉపన్యాశాల గురించి అతిథిగా వచ్చిన డాక్టర్. డి.జగదీశ్వర్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో కాళాశాల వైస్      ప్రిన్సిపాల్ డాక్టర్. వి.వి.జె. గోపాలక్రిష్ణ ప్రశంగిస్తూ విద్యార్థులందరు పూర్వ విద్యార్థి ఆయిన సర్. సి.వి.రామన్ ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో విజయం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్. ఎన్.రామక్రిష్ణ యితర ఆచార్యులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...