5వ వార్డు మారికవలసలో టీడీపీ అభ్యర్థి మొల్లి హేమలత విస్తృత ప్రచారం.
మధురవాడ, పెన్ పవర్
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్బంగా భీమిలి నియోజకవర్గం మధురవాడ 5వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని మొల్లి హేమలత ప్రచారంలో దూసుకుపోతున్నారు.తన తండ్రి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్య నిర్వహణ కార్యదర్శి మొల్లి లక్ష్మణరా వు వారసురాలిగా పదునైన మాటల తూటాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తూ,తన దైన శైలిలో ప్రచారం హోరేతిస్తున్నారు.
ఆదివారం మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీలో గల దుర్గాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సుమారుగా 1000 మందితో పాదయాత్రగా బయలుదేరారు. రాజీవ్ గృహకల్ప కాలనీ , జె.ఎన్.ఎన్ . యు.ఆర్.ఎమ్.న్యూ కాలనీలో గల పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటి పరిస్కారానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్ధించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, పాల్గొన్నారు. కృతజ్ఞతలు :మా యొక్క గెలుపునకు కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, తెలుగు తమ్ముళ్లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డ్ ప్రెసిడెంట్ నాగోతి సత్యన్నారాయణ (జపాన్).సెక్రటరీ ఈగల రవి. భీమిలి నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు బోయి రమదేవి.నమ్మి శ్రీను.5వ వార్డ్ మహిళ అధ్యక్షురాలు హేమలత. గోడు అరుణ.వియ్యపు నాయుడు.ఓలేటి శ్రావణ్.నమ్మి సూరి అప్పారావు. మొల్లి అప్పలస్వామి. టీడీపీ అభిమానులు.కార్యకర్తలు.నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
No comments:
Post a Comment