బ్యాంకుల ప్రైవేటీకరణను తక్షణమే ఆపాలి పాచిపెంట శాంతకుమారి పిసిసి ప్రధాన కార్యదర్శి
అరకు, పెన్ పవర్
కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు ప్రవేటికరణకు వ్యతిరేకంగా సోమ మంగళ వారాలలో చేపట్టిన నిరసనకు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి సంఘీభావం తెలిపారు. సోమవారం అరకు వేలి మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఇక నాయకులతో కలసి బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి శాంతకుమారి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేటికరణ మంత్రం జపిస్తోందని ఏమాత్రం సమంజసంగా లేదని అన్నారు బ్యాంకులు ప్రవేటికరణ చేయడం ద్వారా బ్యాంకు ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలిపారు. నాటి భారత ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ భారత దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజా ఆభరణాలు రద్దు చేసి బ్యాంకుల జాతీయకరణ చేస్తే నేడు మోడీ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసి భారత దేశ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు అదే విధంగా కొన్ని బ్యాంకులు మూత పడే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. చిన్న పరిశ్రమలు, వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతుందని, కార్పొరేట్ శక్తులు తీసుకున్న రుణాలు పక్క దారి పడతాయని, వారిపై చర్యలు తీసుకోవాలంటే ఇబ్బందులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అరకు వేలి కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ మొస్య ప్రేమ్ కుమార్ తెడబారికి భీమారావు ,కె సుశిల,వంతల మలేష్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment