-దంచుతున్న ఎండలు-
-దాహార్తిని తీరుస్తున్న పుచ్చకాయలు-జిల్లా ప్రతినిధి మనోజ్ కుమార్
సెల్:7032074335
జగిత్యాల,పెన్ పవర్ప్రతీ ఏటా మార్చి నెల చివరి రోజుల్లో ప్రారంభమయ్యే ఎండలు ఫిబ్రవరి మాసంలోనే మొదలువడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.శివరాత్రి పర్వదినం దాటినా తర్వాత ఎండలు ఇంత త్వరగా 36 డిగ్రీలు దాటడంతో ఎప్రిల్,మే నెలల్లో ఇంకా ఎండలు ఏ విధంగా ఉంటాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఎండలను దృష్టిలో ఉంచుకుని పుచ్చకాయలని సాగు చేసే వ్యాపారులు గత పదిహేను రోజులుగా వాటిని విక్రయిస్తున్నారు.పట్టణంలోని ఇరువైపులా రోడ్ల పై ఎక్కడ చూసినా పుచ్చకాయలు కి 20 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. దాహార్తిని తీసుకోవడానికి ప్రజలు పుచ్చకాయలను కొనుగోలు చేస్తూ దాహార్తిని తీర్చుకుంటున్నారు. పుచ్చకాయలను విక్రయించే వ్యాపారులు మహారాష్ట్ర లోని పలు ప్రాంతాల్లో నుండి నిత్యం వాహనాల్లో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఈ చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రతీ వీధిలో సైతం చిరు వ్యాపారులు తిరుగుతూ పుచ్చకాయలని విక్రయిస్తూ తమ జీవితాలను గడుపుతున్నారు.అలాగే భానుడి ప్రతాపానికి గొంతు ఎండిపోవడంతో వాటిని తింటూ సేద తీరుతున్నారు.పుచ్చ కాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని పలువురు అంటున్నారు. ఎండకాలంలో దొరికే ఫలం అయినందున ప్రతీ ఒక్కరు తినాలని పలువురు పేర్కొంటున్నారు.

No comments:
Post a Comment