గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన మహిళ కమిషన్ సభ్యురాలు ఈశ్వరిబాయి
ఇంద్రవెల్లి,పెన్ పవర్
కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటిస్తూ పిల్లలు జాగ్రత్తగా చదువుకోవాలని తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరిబాయి అన్నారు సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా 9 ,10 వ తరగతి పిల్లలతో ముచ్చటించారు ఈ సందర్భంగా ఈశ్వరిబాయి మాట్లాడుతూ కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న వేళ భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తమ చదువులు కొనసాగించాలని ఆమె అన్నారు.పరీక్షలు దగ్గర పడుతున్న0ధున కష్టపడి చదవి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉన్నత విద్యను అభ్యసించే దిశగా ప్రణాళిక అలవర్చుకొని పరీక్షలకు హాజరవ్వాలని ఆమె అన్నారు.అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాల లో కోవిడ్ నిబంధనల ఏర్పాటు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గంగారాం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment