హావర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మంచి నీటి పంపిణీ
ఇచ్చోడ,పెన్ పవర్ఇచ్చొడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24హావర్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మంచి నీటి క్యాన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 24హావర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు విశ్వబోధి మాట్లాడుతూ మాన్యశ్రీ కాన్షిరాం జయంతి నుంచి మొదలుకొని అంబేద్కర్ జయంతి వరకు రోజు ఆరోగ్య కేంద్రంలో వచ్చే రోగులకు నీటి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు,సోన్ కాంబ్లే వికాస్,తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment