వైసీపీ సీనియర్ నాయకులు విజయ సాయి రెడ్డి ని కలిసిన కోలగట్ల
విజయనగరం,పెన్ పవర్
రాజ్యసభ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డిని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు లు సోమవారం నాడు విశాఖపట్నంలో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో నగరపాలక ఎన్నికలలోనూ, మున్సిపల్ ఎన్నికల్లోనూ అనూహ్య ఫలితాలు సాధించిన ఎమ్మెల్యే కోలగట్ల ను, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు లను విజయసాయి రెడ్డి అభినందించారు. విజయనగరం నగరపాలక ఎన్నికలలో 50 డివిజన్లకు గాను 48 డివిజన్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్ల ప్రత్యేకంగా ఎమ్మెల్యే కోలగట్ల ను ఆయన అభినందించారు. ఇదే స్ఫూర్తితో త్వరలో జరగనున్న జెడ్ పి టి సి, ఎంపీటీసీ ఎన్నికలలో కూడా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి అన్నారు. జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత పట్ల చర్చించారు.

No comments:
Post a Comment