Followers

సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం

 సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం

గుడిహత్నూర్ ,పెన్ పవర్

 ఆదిలాబాద్ జిల్లా  గుడిహత్నూర్ మండలంలోని డొంగర్గావ్ గ్రామ పంచాయతీలో నేను సైతం మరియు కమ్యూనిటి పొలిసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన  సిసి కెమెరాలను ఆదివారం ఇచ్చోడా సిఐ కంప రవీందర్ స్థానిక సర్పంచ్ ప్రజాప్రతినిధులు కలిసి ప్రారంభించారు. నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు చాలా కీలకంగా పనిచేస్తాయని ఆయన అన్నారు.సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని సీఐ తెలిపారు. ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగింది అని అన్నారు. జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో,పట్టణాల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు. నేరాలను అదుపు చేయడం, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీలు,గ్రామాల్లో  సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు దాతలు ముందుకు రావాలని, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఓర్సు లక్షీబాయ ఎస్సై ఎల్ ప్రవీణ్ , రెహమాన్ ఖాన్, టిఆర్ఎస్ మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్, పిఎసిఎస్ డైరెక్టర్ అశన్న గ్రామస్థులు రవుఫ్ ఖాన్, మారుతీ, సుధాకర్  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...