జ్ఞాన దిక్షే-భీమ్ దీక్షా వాల్ పోస్టర్లు
ఆదిలాబాద్, పెన్ పవర్
ఇచ్చోడ మండల కేంద్రంలోని భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు గురువారం స్వేరోస్ ఆధ్వర్యంలో భీమ్ దీక్షల వాల్ పోస్టర్లు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఇచ్చోడ మండల స్వేరోస్ అధ్యక్షుడు గాయక్వాడ్ విశ్వభోధి మాట్లాడుతూ జ్ఞాన సముపార్జన కోసం చేసే దీక్షే భీమ్ దీక్ష,భీమ్ అంటే జ్ఞానం, భీమ్ దీక్షలు అనగా జ్ఞాన దీక్షలు అని అన్నారు. ఈ భీమ్ దీక్షలు మార్చి 15 మాన్యశ్రీ కాన్షిరాం జయంతి నుంచి మొదలుకొని 14 ఏప్రిల్ భారత రాజ్యాంగ నిర్మాత పరమాపూజ్యులు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు కొనసాగుతాయని,భీమ్ దీక్షల ముఖ్య ఉద్దేశ్యం వ్యక్తి మానసిక, వికాసం,ఇంద్రియ నిగ్రహం, జ్ఞాన సముపార్జన,శారీరక దృఢత్వం,ఆర్యోగ్య పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండల డా. బి ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షులు నర్వాడే రమేష్, ఇచ్చోడ భీమ్ ఆర్మీ మండల అధ్యక్షులు నౌషద్,సాహెబ్,ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment