రాష్ట్ర ప్రభుత్వం శనగ కొనుగోళ్లు చేపట్టాలి..
అఖిలపక్ష నాయకుల డిమాండ్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై బైఠాయించినా అఖిలపక్షం నాయకులు
ఆదిలాబాద్, పెన్ పవర్రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులకు శాపంగా మారాయని రైతుల జీవితాలను ప్రైవేటు కి తాకట్టు పెట్టారని అఖిలపక్షం నాయకులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు వెంటనే చేపట్టాలని బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక పంజాబ్ చౌరస్తాలో రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. గంట పాటు కొనసాగిన ఈ ధర్నా రాస్తారోకో తో అటు ఇటు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతుల కోసం ప్రభుత్వాలకు పట్టవా అని అన్నారు. దేశానికి రైతు వెన్నుముక అని చెప్పుకుంటున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే శనగ కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మరింత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు బండి దత్తాత్రి, లంక రాఘవులు, తలమడుగు జడ్పిటిసి సభ్యుడు గోక గణేష్ రెడ్డి, నర్సింగ్ రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్, గేడం కేశవ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment