బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన
ఇంద్రవెల్లి, పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సంఘాల నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ బుధవారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఇంద్రవెల్లి అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్కాలే శివాజి మాట్లాడుతూ గురుకులాల రాష్ట్ర కార్యదర్శి డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ (ఐపిఎస్) పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సంఘాల నాయకులు అసత్య ఆరోపణలను చేయడం సరికాదని, పెద్దపల్లి జిల్లా దూళికట్ట లో జరిగిన బౌద్ధ విగ్రహ స్థాపనలో వందన కార్యక్రమంలో బౌద్దులు డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ 1956 ఆక్టోబర్ 14 రోజున మహరాష్ట్రలోని నాగ్ పూర్ వేదికగా అందించిన 22 ప్రతిజ్ఞలను పాటించడం జరిగిందని, దాన్ని స్వేరోస్ సంస్థకు అంటగట్టడం సరికాదని కుల మత ప్రాంత భేదాలు లేకుండా నిరంతరం బడుగు బలహీన వర్గాల బిడ్డల అభ్యున్నతి కోసం స్వేరోస్ నిరంతరం కృషి చేస్తుందని, అనేక మంది నిరుపేద విద్యార్థులను ఙ్ణాన వంతులుగా చేసి అసాద్యలను సుసాద్యం చేసి చూపిస్తున్నారని,దేశంలోని అనేక ప్రముఖ యూనివర్సిటీలలో గురుకులాల విద్యార్థులు వారి వల్లే వెళ్లారని, దేశంలోనే నెంబర్ వన్ గా వారు నిలుస్తున్నారని అన్నారు.కాని బీజేపీ నేత బండి సంజయ్ మరియు ఇతర సంఘాల నాయకులు (ఐపిఎస్ అధికారి) గురుకులాల రాష్ట్ర కార్యదర్శి ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ పై చేస్తున్న అసత్య ప్రచారన్నీ ఖండిస్తున్నామని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై తప్పుడు ప్రచారం మనుకోకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు రాస్తా రోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్కాళే శివాజీ, భీం ఆర్మీ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు పరత్ వాగ్ సందీప్, ప్రధాన కార్యదర్శి దత్తా పరత్ వాగ్, ఉపాధ్యక్షులు ఉత్తమ్, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల ప్రధాన కార్యదర్శి ఆచార్య దత్త, స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు సోన్ కాంబ్లే వికాస్, బహుజన సంఘాల నాయకులు భారత్ గాయక్వాడ్, జితేందర్, సూరజ్, పండిత్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment