పొట్టి శ్రీరాములు కి పూలమాలలు వేసి నివాళులర్పించిన కార్పోరేటర్ గంటా అప్పలకొండ
భీమిలి, పెన్ పవర్
అమరజీవి పొట్టి శ్రీరాములు 120వ జయంతిని పురస్కరించుకుని భీమిలి బీచ్ లో ఉన్న పొట్టి శ్రీరాములు నిలువెత్తు విగ్రహానికి జి.వి.ఎమ్.సి.3వ వార్డు కార్పోరేటర్ గంటా అప్పలకొండ,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు సంయుక్తంగా పూలమాలలు వేసి నివాళులర్పించడమైనది. ఈ సందర్భంగా 3వ వార్డు కార్పోరేటర్ గంటా అప్పలకొండ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధనకోసం,తెలుగువారికందరికీ ఒక రాష్ట్రం ఉండాలని 28 రోజులు నిర్విరామంగా ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములని అన్నారు. నేడు తెలుగు వారికి ఒక రాష్ట్రం ఏర్పడుటకు గాని, దేశంలో తెలుగు వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందంటే ఆనాడు మహానుభావులు పొట్టి శ్రీరాములు నాటిన బీజమని అన్నారు.ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి తెలుగువారిగా పుట్టడం, ఆయన జన్మించిన ఈనేలపై మనం జీవించడం మన అదృష్టమని గంటా అప్పలకొండ అన్నారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు1901 మార్చి' 16వ తేదీన మద్రాసులో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారని అన్నారు.అప్పటికి తెలుగువారు చెల్లాచెదురుగా ఇతర రాష్ట్రాల్లో ఉండటం,దేశంలో హిందీ భాష తరువాత ఎక్కువగా తెలుగు మాట్లాడేవారు ఉండటం వలన తెలుగువారికి ఒక ప్రత్యేకమైన రాష్ట్రము ఉండాలని కంకణం కట్టుకొని అలుపెరగని పోరాట యోధుడిలా నిర్విరామంగా 28రోజులు కఠోరమైన ఆమరణ నిరాహారదీక్ష చేశారని అన్నారు. అలాంటి మహానుబావులు ఈనేలమీద పూట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మారోజు సత్యవరప్రసాద్, కాసరపు నాగరాజు, మారోజు సంజీవకుమార్,కనకల అప్పలనాయుడు, కాసరపు ఎల్లాజి, కొక్కిరి అప్పన్న,అప్పికొండ నూకరాజు, కంచెర్ల కామేష్, దాసరి వెంకటేష్,గండిబోయిన పోలిరాజు, రాజగిరి రమణ,సత్తరపు చిన్న,కందుల సుందర్ రావు, సత్తరపు శివ, వాడపల్లి వంశీ,చింతపల్లి నూకరాజు, చింతపల్లి శ్రీను, బొడ్డు రమేష్, వియ్యపు పోతురాజు, అల్లిపిల్లి సతీష్, తెడ్డు రామదాసు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment