Followers

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

 వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

మహారాణి పేట, పెన్ పవర్

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను మంగళవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి  ఘనంగా నివాళులర్పించి,అల్లిపురం గాంధీ బొమ్మ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని అన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఎంతగానో కృషి చేసారన్నారు. మహాత్మా గాంధీ భోదించిన సత్యం,అహింసా,హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు విఠల్ కుమార్,జనరల్ సెక్రటేరి డి.వి.యస్.యన్ రాజు,వైస్ ప్రెసిడెంట్ ఎస్. సుబ్రహ్మణ్యం,చైర్మన్ డి.వి.సత్యానంద్ గుప్త,వారిగల పండు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...