రేణుక ఎల్లమ్మ కళ్యాణానికి రమ్మని మంత్రి కెటిఆర్ ను ఆహ్వానించి న నాయకులు
రాజన్న సిరిసిల్ల , పెన్ పవర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో బొప్పాపూర్ గ్రామంలో ఈ నెల 24 న నిర్వహించ తలపెట్టిన శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రమ్మని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను బొప్పాపూర్ గౌడ సంఘం ప్రతినిధులు మండల ప్రజా ప్రతినిధులు మంగళవారం ఆహ్వాన పత్రిక ను అందజేసి ఆహ్వానించారు .హైదరాబాద్ ఆసెంబ్లీ హాల్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అదికార ప్రతినిధి తోట ఆగయ్య ఆద్వర్యంలో మంగళవారం వెళ్ళి రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ను కలిశారు. కలిసిన వారిలో ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు. రాచర్ల బొప్పాపూర్ మార్కేట్ కమీటి అద్యక్షులు కొండ రమేష్ గౌడ్ మాజీ జడ్పీటీసీ వడ్నాల నర్సయ్య .టిఆర్ఎస్ పార్టీ మండల అద్యక్షులు వరస కృష్ణహారి. సర్పంచ్ ల పోరం మండల అద్యక్షులు కొండాపురం బాల్ రెడ్డి. గౌడ సంఘం ప్రతినిధి చిదుగు గోవర్దన్ గౌడ్. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇల్లందుల శ్రీ నివాస్ రెడ్డి .నంది కిషన్ తదితరులు ఉన్నారు. రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి రావడానికి మంత్రి కెటిఆర్. సానుకూలంగా స్పందించినట్టు కొండ రమేష్ గౌడ్ తెలిపారు. బొప్పాపూర్ మార్కేట్ కమీటీ కీ నిధులు కేటాయించాలనీ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ కు రాచర్ల బొప్పాపూర్ మార్కేట్ కమీటీ చైర్మన్ కొండ రమేశ్ గౌడ్ వినతిపత్రాన్ని ఇచ్చి విజ్ఞప్తి చేయగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నీ పురాతన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి నిధులు ఇప్పించాలనీ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అదికార ప్రతినిధి తోట ఆగయ్య మాజీ జడ్పీటీసీ వడ్నాల నర్సయ్య.ఆలయ కమీటీ చైర్మన్ నంది కిషన్ మంత్రి కెటిఆర్ కు వినతిపత్రాన్ని ఇచ్చి కోరారు.


No comments:
Post a Comment