గాడిగూడా మండలంలో పల్లె ప్రకృతి వనమును ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ డేవిడ్
నార్నూర్, పెన్ పవర్
ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని పల్లె ప్రకృతి పార్కును మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం లో అదనకు కలెక్టర్ డేవిడ్ మండలంలోని సర్పంచ్ లు,పంచాయతీ కార్యదర్శిలు, ఈజీఎస్ టీ ఏ ల తో రివ్వు మీటింగ్ తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టపంగా ప్రవేశపెట్టిన రైతువేదికలు, పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక,నర్సరీ క్రిమిటోరియము పనులు ఎందుకు పూర్తి కాలేదు అని ప్రశ్నించారు.ఈ పనులని నెల చివరి వరకు 25-27 తేదీ లోగ పూర్తి చెలలేని గ్రామ సర్పంచ్ లు,పంచాయతి కార్యదర్శి లు, కాంట్రాక్టు లపై చర్యలు తప్పవని, మండిపడ్డారు.ముఖ్యగా నర్సరీలలో 20% మొక్కలు మాత్రమే ఉన్నాయని, ఉపాధి హామీ పథకం పనుల మాస్టర్ రోల్ లో కచ్చితంగా మూడు ఫోటోలు తీసి కార్యదర్శి, మెట్, ఎంపీవో,ఏపీ ఓ, టీ ఏ, ఎంపీడీఓ ల సంతకలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేశ్వర్,ఎంపీవో సాయి ప్రసాద్,ఏపీఓ అమర్ సింగ్,వివిధ గ్రామ సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, టి ఏ లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.


No comments:
Post a Comment