రెండో రోజు కొనసాగిన అరెస్టుల పర్వం..
వేములవాడ,పెన్ పవర్
నియోజకవర్గ అభివృద్ధి గాలికొదిలి సంవత్సరం కాలంగా జర్మనీలో ఉంటున్న వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు రాజీనామా చేయాలంటూ రెండో రోజు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులను గురువారం ఉదయం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ .. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని .. ఇలా ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని,టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీల నాయకుల చూస్తే భయం మొదలైందని, ఆ భయంతోనే ప్రజాస్వామ్య విరుద్ధంగా అరెస్టులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టయినవారిలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగర్ వెంకటస్వామి, మోడీ కే చంద్రశేఖర్, చిలక రమేష్, మధు, ఎంపిటిసి రాజశేఖర్, నాగుల విష్ణు, సర్పంచ్ రాజ ప్రకాష్, ప్రశాంత్, ఎర్ర మామయ్య, రాజేష్, రాము,రాజు ఉన్నారు


No comments:
Post a Comment