జర్నలిస్ట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస నాయకులను కఠినంగా శిక్షించాలి
బీజేపీ మండల అధ్యక్షులు కట్ట మహేష్
గొల్లపల్లి, పెన్ పవర్
తెరాస నాయకులు గొల్లపెల్లి మండల జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. జర్నలిస్ట్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెరాస నాయకులను కఠినంగా శిక్షించాలని మండల బిజెపి అధ్యక్షులు కట్ట మహేష్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్య సమాజానికి ఎంతో అన్యోన్యంగా ఉంటున్న జర్నలిస్టుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన వారిని కఠినంగా శిక్షించి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. తెరాస ప్రభుత్వ పాలనలో విలేకరులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని బాధిత జర్నలిస్ట్ కు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. బర్నలిస్ట్ లకు మద్దతుగా పోరాటం చేస్తామన్నారు. అలాగే బిజెపి సీనియర్ నాయకులు కస్తూరి సత్యం మాట్లాడుతూ విలేకరుల ను టిఆర్ఎస్ నాయకులు చులకనగా హేళన చేయడం మంచి పద్ధతి కాదని విలేకరులను గౌరవించే విధంగా మాట్లాడాలని టీఆర్ఎస్ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ భారత్ రాష్ట్ర కన్వీనర్ మంచి రాజేష్ బిజెపి జిల్లా అధికార ప్రతినిధి సత్యం జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ బుగ్గారం మండల పార్టీ అధ్యక్షులు మంచాల పరుశురాం బీజేవైఎం మండల శాఖ అధ్యక్షులు వెంకటేష్ కళ్యాణ్ శేఖర్ తదితరులున్నారు..
No comments:
Post a Comment