మాజీ కార్పొరేటర్ చింతపల్లి పోతరాజు జన్మదిన వేడుకలు
విశాఖ ద్వారాకనగర్,పెన్ పవర్శ్రీ భారతి జాలరి కుల సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ చింతపల్లి పోతరాజు జన్మదిన వేడుకలు కొత్తజాలరి పేటలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన కేకు ను కట్ చేశారు. తదుపరి సంఘ సభ్యులు శాలువా ను కప్పి పుష్ప గుచ్చాన్ని సమర్పించారు.కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ హార్ధిక జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. పిమ్మట పేదవారికి పండ్లను , మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ పోతరాజు మాట్లాడుతూ.... కరోన 2 వ దశ విజృంభిస్తున్న తరుణంలోనే ప్రజ లందరూ ముఖ్యంగా మురికివాడల్లో నివసించే వారు అతి జాగ్రత్తగా ఉండాలని శుభ్రతను పాటించాలని , ఎప్పటికప్పుడు చేతులకు శానిటైజేసన్ చేసుకోవాలని , మాస్కులను తప్పక దరించాలని ,సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఎవరైనా కరోనా వ్యాధి లక్షణాల తో భాదపడుతున్నట్లైతే వారు మాకు తెలియజేసినట్లైతే వారికి తప్పక మా సంఘం అన్నివేళలా అందుబాటులో ఉండి తగిన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు కుర్మాన అప్పారావు , ఉపాధ్యక్షులు చింతపల్లి సత్యనారాయణ , ప్రధాన కార్యదర్శి కదిరి అచ్చుత మోహన్ రావు , కోశాధికారి చింతపల్లి పోతరాజు మరియు గ్రామ పెద్దలు , 30 , 37 వ వార్డు ప్రజలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment