Followers

24 గంటలు తాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

24 గంటలు తాగు నీరు అందించేలా చర్యలు చేపట్టాలి

అనకాపల్లి, పెన్ పవర్

గ్రేటర్ విశాఖ పరిధిలో ప్రజలకు24 గంటలు త్రాగు నీరు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అందుకోసం నూతనంగా ఎన్నికయిన కార్పొరేటర్ లు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం అన్నారు. మంగళవారం స్ధానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి మున్సిపాలిటీ గా ఉన్న నాటి నుండి కేవలం మున్సిపల్ నీటి కనెక్షన్లు కి ఉదయం కేవలం గంట మాత్రమే సరఫరా చేసేవారని జీవీఎంసీ లో విలీనం అయినప్పటికీ అదే తీరు కొనసాగుతుండడం విచారకరమన్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 24 గంటలు మంచి నీరుని  సరఫరా చేసేలా ఆలోచన చేయాలని కోరారు. ఒక వేళ అది సాధ్యపడక పోతే కనీసం రెండు పూటలు అయినా సరఫరా చేయాలని, అందుకోసం పట్టణానికి చెందిన కార్పొరేటర్ ల తో పాటు విశాఖ సిటీ పరిధిలోని కార్పొరేటర్ లు అందరూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరారు. విశాఖ ప్రజలకు తాగు నీటి అవసరాల కోసం  మేఘాద్రి గెడ్డ నుండి నిల్వ చేసి ప్రజలకు తాగు నీరు సరఫరా చేయడం జరుగుతుందని ఈ క్రమంలో చాలా నీరు వృధా అవుతుందని అన్నారు. ప్రస్తుతం విశాఖ ప్రజల త్రాగునీటి కోసం 200 ఎంజి డి ల నీరు అవసరమవుతుంది అని అన్నారు. ఐతే ఇటీవల ప్రభుత్వం 3339 కోట్ల రూపాయల నిధుల తో ఏలేరు నుండి నీటిని పైపులైన్ ద్వారా తీసుకువచ్చేందుకు డిపిఆర్ఓ రూపొందిస్తున్నట్లు తెలిసిందని తొలగిన ఆమోదం తెలిపి పనులు ప్రారంభిస్తే తాగునీటి సమస్యలు తొలగిపోతాయి అన్నారు. అలాగే సముద్రపు నీటిని డిశాలినాషన్ పద్ధతి ద్వారా శుద్ధి చేసి పరిశ్రమలకు అందించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం అభినందనీయమని ఐతే ప్రకటనల కే పరిమితం కాకుండా వీలైనంత త్వరగా ప్రాజెక్టును ఆచరణలో తీసుకురావాలని ప్రభుత్వాన్ని కొణతాల సీతారాం కోరారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో జై అనకాపల్లి సేన ఆధ్వర్యంలో మంచి నీటిని సరఫరా చేసేందుకు సిద్ధముగా ఉన్నామని కొణతాల సీతారాం స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...