వాలంటీర్ కు ఆర్థిక సాయం
సంతబొమ్మాళి, పెన్ పవర్
మండలం లోని లక్కివలస గ్రామ సచివాలయం పరిధిలో లో పనిచేస్తున్న గెద్దలపాడు వాలంటీర్ సిరిగిడి యశోదకు సచివాలయం సిబ్బంది ఆర్థిక సాయం అందించారు. వాలంటీర్ యశోద భర్త సాయి ఇటీవల మరణించారు. ఈ మేరకు బాధిత వాలంటీర్ ఆదుకోవడానికి పంచాయితీ సెక్రటరీరమేష్ ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు అందరు కలిసి 20,000/సమకూర్చారు. ఈ మొత్తం ఆర్ధిక సహాయం ను సర్పంచ్ శ్రీరంగం వీరాస్వామి చేతులు మీదుగా బుధవారం వాలంటీర్ కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో సచివాలయం సిబ్బంది, వాలంటీర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment