మహిళల భద్రతకు అండగా "దిశ" వాహనం
గుమ్మలక్ష్మీపురం,పెన్ పవర్
గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళల భద్రతకు గాను "దిశ" ద్విచక్ర వాహనాన్ని జిల్లా యస్.పీ అందించినట్లు యస్.ఐ కృష్ణప్రసాద్ తెలియచేసారు.జూనియర్ కళాశాల లోని మహిళా విద్యార్థులతో సమావేశం నిర్వహించిన మండలంలోని ఏ ఒక్క మహిళ విద్యార్థినిలు ఇబ్బందులకు గురైతే తక్షణమే ప్రత్యేక సహాయక నంబర్ "100" మహిళా సహాయవాణి నంబర్ "112" సైబర్ మిత్రమా నంబర్ "9121211100" ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ "181" లలో ఏదో ఒక నంబర్ కి ఫోన్ చేస్తే తక్షణమే స్పందించి జీ.పీ.యస్ సాంకేతికత ఆధారంగా ఆపదలో ఉన్న మహిళలలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి బాధిత మహిళలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతమైన గుమ్మలక్ష్మీపురం లో ఈ దిశ వాహనం యొక్క ఆవశ్యకత చాలా ఉందని ఈ వాహనంలో గిరిశికర ప్రాంతాలకు కూడా అతి తొందరగా చేరుకుని బాధితులకు అండగా నిలబడగలమని తెలిపారు.ఈ దిశ వాహనం చూసి విద్యార్థినిలు హర్షం వ్యక్తం చేసు ఈ వాహనం కూత వినపడితే ఆకతాయిల గుండెల్లో గుబులు పుట్టడం కాయమని మహిళల రక్షణకు ఎంతగానో ఉపయోగ పడుతున్న ప్రభుత్వ భద్రత పతకాలకు వారి హర్షద్వానాలతో జోహార్లు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో యస్.ఐ కృష్ణ ప్రసాద్ తో పాటుగా నందు, మహిళా కానిస్టేబుల్ సంధ్య, మాలతి పాల్గొన్నారు.
No comments:
Post a Comment