జిల్లాలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం.
జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన అధికారి వసుంధర
పెన్ పవర్,విశాఖపట్నంక్షయ పారిపోతుంది- దేశం గెలుస్తుంది అన్న నినాదంతో రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా క్షయ వ్యాధి నిర్మూలనా అధికారి డాక్టర్ ఎన్. వసుందర అన్నారు. మంగళవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. క్షయ పారిపోతుంది దేశం గెలుస్తుంది అనే నినాదం ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ప్రభుత్వాలు కాలు జారీ చేశాయని ఆ మేరకు చర్యలు చేపట్టామన్నారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు గ్రామాల్లో క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు క్షయవ్యాధిని సమూలంగా నివారించాలని తగిన చర్యలు తీసుకోవడానికి ప్రజలు సహకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో క్షయ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అన్న అంశాన్ని ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. క్షయ వ్యాధి నిర్మూలన శాఖ అధికారులు సిబ్బంది రెండు వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని వసుంధర తెలిపారు.

No comments:
Post a Comment