చలి వేంద్రముని ప్రారంభించిన జోనల్ కమిషనర్
కూకట్ పల్లి,పెన్ పవర్
యోగ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమని కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కూకట్ పల్లీ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని యోగ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా ఆయుర్వేద విద్యా, ఆహార విద్యా, యోగా నేర్పించడమే కాకుండా సమాజ సేవలో భాగంగా ప్రతిరోజు పలు ఆసుపత్రులు తిరుగుతూ సుమారు 700 మందికి పైగా ఆహారం అందజేస్తున్న జగన్ గురుజిని అభినందించారు. జగన్ గురూజీ మాట్లాడుతూ కరోనా సమయంలో అరవై రోజుల పాటు రోజు రెండు వేల మందికి ఆహారం అందజేయడం జరిగిందని, అదే సేవ దృక్పథంతో మూడు నుండి నాలుగు నెలల పాటు బాలానగర్ చౌరస్తా నుండి మియాపూర్ చౌరస్తా వరకు మజ్జిగ, నిమ్మరసం, ఫ్రూట్ జ్యూస్ వంటి పానీయాలను రహదారుల వెంబడి సంచరిస్తూ ఉచితంగా అందచేస్తామని, తమ సంస్థ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగుతాయని వారు తెలియజేశారు. డిప్యూటీ కమిషనర్లు మాట్లాడుతూ ఇలాంటి మంచిపని చేయడం ఎంతో హర్షదాయకమని, నిరంతరం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే తమ సిబ్బందికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతయని, భవిష్యత్తులో ఈ సంస్థ మరిన్ని సేవలు చేస్తూ ముందుకు వెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో డిప్యుటీ కమీషనర్లు రవికిరణ్, ప్రశాంతి, హెల్త్ ఆఫీసర్లు చంద్రశేఖర్, సంపత్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


No comments:
Post a Comment