Followers

“శ్రీ రామదాస్ పేపర్ మిల్ సందర్శించిన ఆదిత్య బిజినెస్ స్కూల్ విద్యార్థులు”

శ్రీ రామదాస్ పేపర్ మిల్  సందర్శించిన ఆదిత్య బిజినెస్ స్కూల్ విద్యార్థులు

గండేపల్లి,పెన్ పవర్

   గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యాప్రాంగణం నందు గల      ఆదిత్య బిజినెస్ స్కూల్ నందు  బి.బి.ఎ, మొదటి  సంవత్సరం    చదువుచున్న  విద్యార్థులు తూర్పుగోదావరి జిల్లా  కడియం లో గల  "శ్రీరామదాస్ పేపర్ మిల్"  ను    సందర్శించినట్లు ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ డా. ఎన్. సుగుణారెడ్డి  తెలియజేసారు. విద్యార్థులు అందరూ ఈ క్షేత్ర పరిశీలనను సంతృప్తి కరంగా ముగించి తద్వారా పొందిన జ్ఞానాన్ని భవిష్యత్ లో వ్యాపార పారిశ్రామిక రంగాలలో అన్వయించుకొని ఉజ్జ్వల మైన ప్రగతికి బాటలు వేసుకోవాలని ఆమె అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో  విద్యార్థులు రాణించాలంటే పుస్తక పఠనాజ్ఞానమే కాకుండా ఇటువంటి స్వయం అవగాహన జ్ఞానం (క్షేత్ర పరిశీలన)ఎంతో దృఢమైన ముద్ర విద్యార్థుల మస్తిష్కాలలో వేస్తుందని అన్నారు. విద్యార్థులకు ఇటువంటి  పారిశ్రామిక సందర్శనలు  వలన క్షేత్ర స్థాయిలో రోజువారీ కార్యక్రమాలు విపులంగా తెలుసుకొని అవగాహన చేసుకొనేందుకు ఎంతగానో తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు.  విద్యార్థులు ఆంగ్లభాషా పరిజ్ఞానం పెంపొందించుకోవాలని డా. సుగుణారెడ్డి సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. ఆస్ధాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు ప్రత్యక్ష పరిశీలనతో మరింత విశ్లేషణాత్మక జ్ఞానం పొందడానికి  ఈ కార్యక్రమం దోహద పడుతుందని, విద్యార్థులు  తాము ఎంచుకొన్న మార్గంలో ప్రణాళికా బద్దంగా చదవడం ద్వారా లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫాకల్టీ  వి.అప్పలకొండ, శ్రీమతి రేణుక, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...