Followers

తహశీల్దార్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

 తహశీల్దార్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

తాళ్ళపూడి, పెన్ పవర్

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని మంగళవారం తాళ్ళపూడి తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి తహసీల్దార్ ఎం.నరసింహమూర్తి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎం.నరసింహమూర్తి మాట్లాడుతూ తొలిభాషా ప్రయుక్త రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన మహనీయుడని, వారి త్యాగనిరతిని గుర్తుంచుకొని, వారిని ఆంద్రులు స్మరిస్తూ ఉండాలని అన్నారు. అనంతరం ఏఎస్వో జోడాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 1901 మార్చి 16 వ తేదీన మద్రాసు లోని జార్జ్ టౌన్ అణాఫిల్లే వీధిలో  165 వ నెంబర్ గల ఇంట జన్మించి, ఉప్పుసత్యాగ్రహం, క్విట్టిండియా ఉద్యమాల్లో పాల్గొని, హరిజనోద్దరణకు కృషి చేశారని తెలిపారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 50 రోజులు పైగా ఆమరణ నిరాహారదీక్ష చేసి డిసెంబర్ 15 అర్థరాత్రి 1952 లో తన ఆశయ సాధన కోసం అమరుడు అయ్యాడని, వారి త్యాగనిరతికి ప్రతీకగా డిసెంబర్ 19, 1952 లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రకటన చేశారని తెలిపారు. ఆయన అమరజీవి అయిన 126 వ నెంబర్ గల ఇంటిని అయన స్మృతి చిహ్నం గా మద్రాసులో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుచున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిటి రాజాబాబు, ఆర్ ఐ క్రాంతిరేఖ, సీనియర్ అసిస్టెంట్ సత్యేంద్ర కుమార్, జూనియర్ అసిస్టెంట్ ఎ.ప్రభుకుమార్, విఆర్వో లు ప్రకాష్, రవి, కమల్, ప్రవీణ్, లీలావతి, నరేష్, స్వర్ణ, విఆర్ఎ లు సురేష్, ఉమ, శ్రీలక్ష్మి, భాగ్యలక్ష్మి, కంప్యూటర్ ఆపరేటర్ బాబీ, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...