విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దు...
ఎటపాక మండలంలో బంధు ప్రశాంత
ఎటపాక,పెన్ పవర్
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎటపాక మండలం లక్ష్మీపురం తోటపల్లి రహదారులపై అఖిలపక్ష నాయకులతోసి బంద్ ప్రశాంతంగా కొనసాగింది ...ఈ బంద్ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిలపక్ష నాయకులు విషం పెళ్లి వెంకటేశ్వర్లు రంబాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ...కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం భావ్యం కాదని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చెయ్యడంతో ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక వనరులు వాటిల్లుతాయనే అదేవిధంగా కార్మికులకు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని అన్నారు,విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని దానిని ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డు దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రంలోని ఉన్నటువంటి బీజేపీ పార్టీ పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి పూనుకుందని అని అన్నారు,దీనిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చెయ్యకుండా ఉండేందుకు అందరం ఐక్యంగా పోరాటం చేద్దామని అన్నారు,విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో బంద్ ప్రశాంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment