పెద్దేవంలో స్మశానవాటిక పనులు పరిశీలించిన ఎంఆర్వో నరసింహమూర్తి
తాళ్లపూడి, పెన్ పవర్జల జీవన్ మిషన్ కార్యక్రమంలో పారిశుద్ధ్య వార్షికోత్సవం లో భాగంగా పెద్దేవం గ్రామంలోని స్మశాన వాటికలోని చెట్లను తుప్పలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ప్రెసిడెంట్ తిగిరిపల్లి వెంకట్రావు, వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి మరియు వైస్ ప్రెసిడెంట్ తోట రామకృష్ణ పంచాయతీ కార్యదర్శి రంగనాయకమ్మ,విఆర్వో సుజాత, వార్డు మెంబర్లు మైలవరపు రాధాక్రిష్ణ, యండపల్లి లక్ష్మణ్ రావు, స్మశాన వాటిక సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాళ్లపూడి ఎంఆర్వో ఎం.నరసింహ మూర్తి వచ్చారు. ఎంఆర్వో నరసింహమూర్తి మాట్లాడుతూ సోమ, మంగళ వారాల్లో స్మశాన వాటిక భూమికి సర్వే పెట్టిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment