ఆరిలోవలో బంద్ ప్రశాంతం
విశాఖ ఉక్కు ప్రైవేటీకారణకు వ్యతిరేకంగా ఎ. ఐ. టి.యు.సి. ఆధ్వర్యంలోకేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే యోచన లో ఉన్నసంగతి అందరికీ తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని శుక్రవారం ఉదయం ఆరిలోవలో సి. ఐ . టి. యు, ఎ. ఐ. టి. యు.సి. ఆద్వర్యంలో సి.పి.ఐ. సంఘ కార్యదర్శి కె. శంకర్ రావు అధ్యక్షతన బంద్ ప్రశాంతంగా జరిగింది. “ విశాఖ ఉక్కు కార్మికుల హక్కు “ , అనే నినాదాలతో ఆప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ సందర్బంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ... సోదర సోదరీ మణులరా ఈ రోజు దేశవ్యాప్తంగా అన్ని నగరాలలోని , పట్టణాలలోని , మండలాలలోని, ప్రాంతాలలోని ఈ భారత్ బంధు జరుతావుంది.
ఈ బంధు కు మద్దత్తుగా బి. జె. పి. మినహా అన్ని రాజకీస్ పార్టీల వారు , అన్ని కార్మిక వర్గాలవారు మద్దత్తు నిచ్చారని , సి.పి.ఎం. సి.ఐ. టి.యు. కార్మిక సంఘాలు , ప్రజా సంఘాలు మహిళా సంఘాలు , ఆధ్వర్యంలో బంద్ జరుగుతున్నదని , ఎల్.ఈ.సి.ని , జి.ఐ. సి. ని , ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుందని , స్టీల్ ప్లాంట్ ను అమ్మేయడానికి సిద్ధమైందని , అలాగే షిప్యార్డు, డక్ యార్డ్ , పోర్ట్ , రైల్వేస్ లాంటి పరిశ్రమలను ప్రైవేట్ సంస్థలకు కారు చౌకగా ధారాదత్తం చేయడానికి నిసిగ్గుగా వ్యవహరిస్తున్నదని , అటువంటి కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా అందరూ ఈ భారత బందో లో పాల్గొని విజయవంతం చేసి నరేంద్ర మోడి కి బుద్ది చెప్పాలని ప్రజలకు , వ్యాపారస్తులకు విజ్ఞప్తి చేసారు. 32 మందు కార్మికుల బలిదానం తో వచ్చినటు వంటి ఈ కర్మాగారాన్ని పాలమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ “ఈ కర్మాగారాన్ని ఖచ్చితంగా అమ్మివేస్తున్నామని దీని విషయం ఎవ్వరికీ చెప్పవలసిన అవసరం లేదని “ చేసే దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ బంధు లో మహిళా సంఘ నాయకురాలు ఎస్. రంగమ్మ , సి.ఐ. టి.యు. నాయకులు కుమార్ , మరియు సంఘ కార్యకర్తలు మహిళలు పెద్దఎత్తున వ్యాపారస్తులు ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.
No comments:
Post a Comment