ఎంపిడిఓ రాజశేఖర్ గ్రామ వాలంటీర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు
తాళ్లపూడి, పెన్ పవర్తాళ్లపూడి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తాళ్లపూడి మండలం లో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటీర్ పోస్టులకు ఇంటర్వ్యూలు ఎంపిడిఓ ఎం.రాజశేఖర్ నిర్వహించారు. ఎంపిడిఓ రాజశేఖర్ మాట్లాడుతూ పెద్దేవం 2, ప్రక్కిలంక 1, తిరుగుడుమెట్ట 1, మొత్తం నాలుగు ఖాళీగా ఉన్నాయని, 12 మంది అప్లై చేసుకోగా, 11 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని, వీరిలో నలుగురిని సెలెక్ట్ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ పీఆర్ అండ్ ఆర్డీ జి.ప్రసాద్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment