Followers

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటికరణను నిలుపుదల చేయాలి

 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటికరణను నిలుపుదల చేయాలి

సిఐటియు మరియు తెలుగుదేశం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్

పరవాడ,పెన్ పవర్

మండలం లోని లంకెలపాలెం నాలుగు రోడ్ల కూడలిలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటికరణకు పూనుకున్న   కేంద్ర ప్రభుత్వ విధానాలపై  దేశ వ్యాప్త బంద్ పిలుపుకు అనుకూలంగా సిఐటియు మరియు తెలుగుదేశం పార్టీలు బంద్ ను ప్రశాంతంగా విజయవంతం చేసాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణ మూర్తి మాట్లాడుతూ అటు కేద్రం లోను ఇటు రాష్టం లోని ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వలన రాష్ట్ర ప్రజలు ఉద్యోగ పరంగా,ఆర్ధిక పరంగా,అభివృద్ధి పరంగా ఎంతో నష్టపోతున్నారు అని ఆవేదనతో అన్నారు.కేంద్ర లో వున్న మోడీ ప్రభుత్వం అయితే ఏకంగా రైల్వేను,విమానాశ్రయాలను,పోర్టు లను,స్టీల్ ప్లాంట్ లను ఇలా దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్ని ప్రవేట్ పరం పేరుతో గుజరాతీ వ్యారస్థులకు దోచి పేడుతోంది అని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖిరి అవలంభిస్తు అక్కడ కేంద్రానికి సపోర్ట్ చేస్తూ ఇక్కడ రాష్ట్ర ప్రజల ముందు దొంగ కన్నీరు కరిస్తోంది అని అన్నారు.ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోక పోతే రాబోయే రోజుల్లో ప్రజలే వారికి బుద్ధి చెపుతారు అని అన్నారు.అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి గని శెట్టిసత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గాలకు నష్టదాయకంగాను కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరేలా  దోచిపెడుతున్నాయి అని విమర్శించారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 32 మంది  ప్రాణత్యాగం  చేసి సాధించిన విశాఖ ఉక్కు ను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక,ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని దీనికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాడాలని గనిశెట్టి పిలుపునిచ్చారు. భారీ ఎత్తున జరిగిన బంధు రాస్తారోకోకు కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బ్యాంక్ లు, స్కూల్స్, విద్యుత్ కార్యాలయం, షాపులు ఇలా అన్ని వాణిద్య షాపులు,ఆఫీస్ లు అన్ని బంద్ కి మద్దతుగా మూసివేసారు అని తెలియజేసారు.  అలాగే ఉదయం ఆరు గంటలకే ప్రారంభించిన బంద్ కార్యక్రమంలో సిఐటియు నిర్వహించిన బంద్ కి తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటిస్తూ మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి  79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ బంద్ కి మద్దతుగా పాల్గొని విజయవంత చేశారు అని గనిశెట్టి అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,  సిఐటియు నాయకులు కరణం వెంకట్రావు, వై అప్పారావు, శ్రీను, కే రవణమ్మ ,ఆకులమ్మ ఆటో కార్మిక సంఘం నాయకులు రామారావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...