మలకపల్లిలో బంద్ కు మద్దతుగా విద్యార్థి సంఘాలు
తాళ్లపూడి, పెన్ పవర్కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 26 వ తారీఖు శుక్రవారం రైతు సంఘాలు, కార్మికసంఘాలు, భారత్ బంద్ కు పిలుపు నేపథ్యంలో మలకపల్లి విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. మలకపల్లి హైస్కూల్ ఆవరణలో విద్యార్ధి సంఘాల వారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. స్టూడెంట్ నాయకులు గెడ్డం వినోద్ మాట్లాడుతూ వ్యవసాయ నల్ల చట్టాలను, 2020 విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, లేబర్ కోడ్ లను రద్దుచేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటికరణను ఆపాలని, అన్ని పంటలకు కనీస మద్దతు ధరలకు చట్ట బద్ధత కల్పించాలని, ఆదాయపన్ను పరిదిలోలేని కుటుంబాలకు ఆహార భద్రత కల్పించాలని, విశాఖ ఉక్కును ప్రవేటికరణను ఆపాలని, అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ల ప్రవేటికరణ ఆలోచనలు విరమించుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గౌతమ్, ప్రేమ్ కుమార్, గెడ్డం నందన్ కుమార్, వంశీ, బి.శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment