Followers

బారత్ బందును జయప్రదం చేయండి

 బారత్ బందును జయప్రదం చేయండి..


కుత్బుల్లాపూర్, పెన్ పవర్

రైతును రక్షించడానికి మూడు రైతు చట్టాల రద్దుకు, రైతు సంఘాల పిలుపుతో నేడు దేశవ్యాప్త బందును జయప్రదం చేయాలని సిపిఐ, సిపిఎం నాయకులు కీలు కానీ లక్ష్మణ్ హరినాథ్ పేర్కొన్నారు.. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టి రైతు జీవితంలో మట్టి పోస్తున్నది చట్టాలు అమలు జరిగితే రైతు నడ్డి విరిగి బజారున పడతారని, రైతును కూలిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం బాటలు వేస్తుందని.. ఈ చట్టాలను ప్రకటించిన నాటి నుండి రైతులు రైతు సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఆందోళనలు చేస్తున్నారని, అయినా కేంద్ర ప్రభుత్వం అన్నం పెట్టే రైతు మాటలను పెడచెవిన పెట్టి.. ప్రజలను మోసం చేసే కార్పోరేట్ సంస్థలకు బాసటగా నిలబడుతుందని ఆరోపించారు.. నిత్యవసర వస్తువులు పెద్ద మొత్తంలో నైనా ఎవరైనా నిలువ చేసుకోవచ్చు అనే చట్టాన్ని కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మారుస్తూ.. ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని గుర్తుచేశారు.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు గోడలుగా మార్చి వారి హక్కులను పూర్తిగా హరించి వేస్తుందని, సంపద సృష్టి కర్త రైతులను కార్మికులను నిరాయుధులను చేసి.. కార్పొరేట్ సంస్థలకు సకల హక్కలు కల్పిస్తుందని, అన్నారు.. దేశంలోని ప్రజలకు సకల వ్యాపారస్తులకు ప్రమాదకరమైన గుదిబండగా తయారవుతాయని, అందుకే రైతు చట్టాలను రద్దు చేయాలని లక్షలాది మంది రైతులు 2020 నవంబర్ 26 నుండి తిరుగులేని పోరాటాన్ని చేస్తూ అన్నం పెట్టే రైతు అండగా ఉందాం, సున్నం పెట్టే కార్పొరేట్ దోపిడీదారులను తరిమికొట్టడదాం అన్న నినాదంతో కలిసి నడుద్దామని కీలుకాని లక్ష్మణ తెలిపారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...