చెరువు గట్టుపై చెట్లు నరికివేతపై ఫిర్యాదు
పెన్ పవర్, కరపయండమూరు గ్రామపంచాయతీ పరిధిలోని చెరువుగట్టుపై ఉండే చెట్లను అనుమతి లేకుండా నరికివేయడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తంచేశారు. పంచాయతీ అనుమతి లేకుండా చెట్లు నరికివేసినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు మాజీ సర్పంచ్ మారెళ్ల వెంకటరమణ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి శ్రీనివాస్ ఎస్.కుమారబాబు తదితరలు తెలిపారు. దీనిపై గ్రామకార్యదర్శి పి. వీరభద్రరావును వివరణ కోరగా చెరువుగట్టుపై ఉండే చెట్లు నరికివేయుటకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదని. బాధ్యులైనవారిపై చర్య తీసుకోవాలని అటవీశాఖాధికారులకు ఫిర్యాదుచేస్తున్నట్టు కార్యదర్శి తెలిపారు.

No comments:
Post a Comment