ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం...
ఆదిలాబాద్, పెన్ పవర్తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లో మండల, జిల్లా పరిషత్ లకు అధిక నిధులు కేటాయించడం పట్ల ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం ముఖ్య మంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ మాట్లాడుతూ.రాష్ట్రంలో తొలిసారిగా బడ్జెట్లో మండల, జిల్లా పరిషత్ లకు రూ. 500 కోట్లు కేటాయించడం హర్షణీయంన్నారు. బడ్జెట్ లో స్థానిక సంస్థలకు పెద్దపీట వేసిన ముఖ్య మంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పిటిసి ఫోరం అధ్యక్షుడు తాటిపల్లి రాజు, జెడ్పిటిసి లు భాస్కర్, అక్షిత పవర్, వనిత రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment