ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేసిన ఎబివిపి
కూకట్ పల్లి, పెన్ పవర్
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన, స్వేరోలు చేస్తున్న దాష్టీకంపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కూకట్ పల్లిలో నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం స్వెరో సంస్థ ఫౌండర్, ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈకార్యక్రమంలో భాగంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ వినోద్ హిందుస్థానీ మాట్లాడుతూ గురుకులాల్లో కాంట్రాక్టుల పేర నిధులు దండుకుంటున్న స్వేరోల అక్రమాలను అరికట్టాలని, గురుకులాల్లో అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలపై విచారణ జరిపి దుండగులను శిక్షించాలని, వీటన్నిటిని విశ్రాంత నాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెజారిటీ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా వ్యవహరిస్తూ విద్యార్థుల మెదళ్లలో విషబీజాలను నాటుతున్న గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ను తక్షణమే విధుల నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సనీల్, మురళీ, కార్యకర్తలు గోపాల్, జమీల్ నిఖిల్, రాకేష్, సుధీర్, సాయి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.


No comments:
Post a Comment