Followers

అదనపు కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నర్సింహారెడ్డి

అదనపు కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన నర్సింహారెడ్డి.. 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ను కలిసిన నర్సింహారెడ్డి.. 

కలెక్టర్ చాంబరులో సంతకాలు చేసి బాధ్యతలు స్వీకారం.. 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు కృషి.. 


మేడ్చల్ , పెన్ పవర్ 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని కొత్తగా మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఏనుగు నర్సింహారెడ్డి పేర్కొన్నారు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తా మని ఈ విషయంలో ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతిని కలిసిన ఆయన కలెక్టర్‌కు పూలబోకె అందించారు.. అనంతరం అదనపు కలెక్టరేట్లోని ఛాంబర్లో సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు,  అధికారులు,  ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.  జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలన్నింటినీ పక్కా ప్రణాళికతో అధికారుల సహకారంతో విజయవంతమయ్యేలా కృషి చేస్తానని వివరించారు . కరోన రెండో దశ విస్తృతంగా వ్యాపిస్తున్నందున ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, సానిటైజ్ చేసుకోవాలని, టీకాలు వేసుకోవాలని ప్రజలకు సూచించారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...