ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ
కంచరపాలెం రైతు బజార్ వద్ద సెకండ్ వేవ్ కరోనా పట్ల తీసుకోవాల్సిన చర్యల పట్ల ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ క్యాంపయిన్ బుధవారం నిర్వహించాయి. కరోనా కి ప్రస్తుతానికి మందు లేదని, కాబట్టి నివారణ ఒక్కటే పరిష్కారం అని, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ నాయకులు కామేశ్వరరావు అన్నారు. అవగాహన కోసం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ప్రజారోగ్య కమిటీ నాయకులు సంతోష్, సోమేశ్వరరావు, అప్పలరాజు,పి.రామారావు, ధర్మరాజు, జగదీశ్, రాము, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment