భారత్ వికాస్ పరిషత్ రాష్ట్రకార్యదర్శిగా వాగ్దేవి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.సత్యనారాయణ
మహారాణి పేట, పెన్ పవర్
విశాఖ నగరానికి చెందిన వాగ్దేవి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం వి వి సత్యనారాయణ 2021- 2022 గాను భారత్ వికాస్ పరిషత్ రాష్ట్రకార్యదర్శిగా ఎంపికయ్యారు. వీరిని భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు జి బాలచంద్రుడు ఎంపిక చేయగా వివిధ ప్రాంతాలకు చెందిన భారత్ వికాస్ పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు బలపరిచారు ఏప్రిల్ 2021 నుండి 2002 ఏప్రిల్ వరకు భారత్ వికాస్ పరిషత్ రాష్ట్రస్థాయిలో మరియు వివిధ జిల్లాల స్థాయిలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు రాష్ట్ర కార్యదర్శిగా ప్రాతినిధ్యం వహిస్తారు.తనను భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ఎం వి వి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేసి శక్తివంచన లేకుండా సంస్థ ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ జాతీయస్థాయి ఉపాధ్యక్షులు ఆర్ సి జైన్ బి వి పి సీనియర్ సభ్యులు డి సూర్య సూర్యప్రకాశరావు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఎం వి రాజశేఖర్, పి వెంకటేశ్వరరావు టి హేమచందర్ తదితరులు పాల్గొన్నారు.జాతీయస్థాయి ఉపాధ్యక్షులు జైన్ గారి చేతుల మీదగా నియామక పత్రం అందుకున్నారు.
No comments:
Post a Comment