పురుగుల మందు తాగి మృతి
లక్షెట్టిపెట్, పెన్ పవర్మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బొలిశెట్టి వజ్ర(32)అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్ఐ దత్తాత్రి తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మృతురాలికి గత 18 ఏండ్ల క్రితం అదే గ్రామానికి చెందిన బొలిశెట్టి సత్తయ్య తో వివాహం అయి ఇద్దరు పిల్లలు ఉన్నారన్నారు.గత పదేళ్ళుగా మృతురాలికి వల్ల తల్లిగారి కుటింబికులకు రాకపోకలు లేవని ఈ నెల 18న మృతురాలి అన్న ఇంట్లో శుభకార్యం ఉంది తప్పకుండా రావాలని ఫోన్ చేయగా.పోవడం వద్దని తన భర్త సత్తయ్య చెప్పడంతో మనస్తాపం చెంది క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడింది మృతురాలి తల్లి తిప్పని లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దత్తాత్రి పేర్కొన్నారు.

No comments:
Post a Comment