కరోనా వాక్సిన్ వేయించుకున్న ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు.
వెల్దుర్తి , పెన్ పవర్
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం లో కరోనా కేసులు పెరుగుతుండడంతో వెల్దుర్తి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రజా ప్రతినిధులకు వైద్య సిబ్బంది కరోనా వ్యాక్సిన్ వేశారు. ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి నాతోపాటు ఎంపీటీసీ సర్పంచ్ లకు కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు వైద్యులు ప్రవళికతెలిపారు. అలాగే 45 సంవత్సరాల పైబడిన వారందరికీ కరోనా టీకా ఇవ్వడం జరుగుతుందని, అందరూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి టీకాలు వేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశాన్ని వినియోగించుకొని భయంకరమైన కరోనా మహమ్మారి నుండి తమ ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పారు.



No comments:
Post a Comment