Followers

జిల్లావ్యాప్తంగా 98వేలలో రాపిడ్ పరీక్షలు

 జిల్లావ్యాప్తంగా 98వేలలో రాపిడ్ పరీక్షలు.

 మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు

 వెల్దుర్తి,  పెన్ పవర్

 మెదక్ జిల్లా వ్యాప్తంగా 98వేల రాపిడ్ టెస్టులు చేయడం జరిగిందని జిల్లా వైద్యాధికారివెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిర్వహించిన రాపిడుటెస్టులో 4,038 మందికి పాజిటివ్ రాగా,అందులో 38 మంది ప్రాణాలు కోల్పోయారని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ మధ్య కాలంగా గత కొద్ది రోజుల నుండి ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా 10 నుండి 12 కరోనా కేసులు నమోదవుతున్నాయని అన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎవరు కూడా అనారోగ్యానికి గురికావడం లేదని ఎవరు కూడా భయపడిన అవసరం లేదని తెలిపారు జిల్లా వ్యాప్తంగా 14 సెంటర్లలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ప్రతిరోజు సుమారు 1400 మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునే అవకాశముందని ఇంకా అవసరం ఉంటే వ్యాక్సినేషన్ సెంటర్ ను పెంచేందుకు కృషి చేస్తామన్నారు జిల్లాలో 16 వేల మంది కి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని వచ్చే రెండు నెలల్లో 70 వేల వ్యాక్సిన్ వేసేందుకుఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ప్రభుత్వం 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని 45 సంవత్సరాల వయసున్న వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అందరూ సహకరిస్తే త్వరలోనే కరోనా ను పారద్రోలడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...