చలివేంద్రం ప్రారంభించిన తాసిల్దార్.. దూసి రవి
మెంటాడ, పెన్ పవర్మెంటాడ మండలం లోని కుంతిని వలస గ్రామం లో బుధవారము గ్రామ సర్పంచ్ పెద్ది రెడ్ల రమేష్ నాయుడు ఆధ్వర్యంలో మెంటాడ తాసిల్దార్ దూస రవి చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రవి మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. గ్రామస్తులు కూడా తాగునీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనిల్ కుమార్, వైసిపి నాయకులు పొరిపిరె డ్ది సూర్యారావు, వై. సింహాచలం, పలువురు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment