తీరంలో ఇసుక దందా..
సంతబొమ్మాళి,పెన్ పవర్
మండలంలోని పాత మేఘవరం లో సాయి పవన్ రొయ్యల హేచరి పనుల కోసం తీర ప్రాంత సముద్రం ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఒక ట్రాక్టర్, జేసీబీని టెక్కలి ఫారెస్ట్ రేంజర్ అధికారి పి వి శాస్త్రి స్వాధీనంచేసుకున్నట్లుతెలిరు.నిబంధనలు విరుద్ధంగా సముద్ర పరివాక ప్రాంతాల్లో ఇసుకను రవాణా చేస్తున్న ఈ సమయంలో పట్టుకుని ని పీఓఆర్ నెంబరు 06671 అటవీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి టెక్కలి ఫారెస్ట్ రేంజ్ ఆధ్వర్యం లో వాహనాలు సీజ్ చేసి ఉంచామని ఫారెస్ట్ అధికారి అరుణ తెలిపారు. కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే గతంలో కూడా ఈ హేచరీకి సంబంధించి పలు కేసులు ఫైల్ అయినట్లు సమాచారం. అలాగే ఎటువంటి అనుమతులు లేకుండా ఫారెస్ట్ భూముల్లో,అక్రమ తవ్వకాలు జరిపి సముద్రంలోని వరకు పైప్ లైన్లు కూడా వేసినట్లు సమాచారం. వీటి అంతటికీ మైనింగ్ అధికారుల, రెవెన్యూ అధికారుల పూర్తి సహాయ సహకారాలతో ఇలాంటి దుశ్చర్యలు కు పాల్పడుతున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment