బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలి
పరవాడ,పెన్ పవర్
కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉద్యోగులకు,కార్మికులకు ద్రోహం చేసేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటికరణ చేయాలి అనే ఏకపక్ష నిర్ణయాలను విరమించుకోవాలి అని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో తాడి రైల్వే స్టేషన్ లో ఆందోళన చేశారు.ఈ సందర్భంగా సి ఐ టి యు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు.రైతులపై,ప్రజలపై భారాలు మోపే నూతన వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే బిజెపి మోడీ విధానాలు నశించాలి అన్నారు.ఎందరో త్యాగాల మీద నిర్మితమైన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని స్టీల్ ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలని ఆయన కోరారు.కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు. దేశానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చిన భారత రైల్వే రంగాన్ని ప్రైవేటీకరించడం సిగ్గుచేటన్నారు.బీజేపీ ప్రభుత్వం రైతు కి వ్యతిరేకంగా తీసుకు వచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కేద్రం బిజెపి ప్రభుత్వం పరిపాలనలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రవేటికరణ పేరుతో గుజరాతీయులకు దేశాన్ని దోచి పెడుతోంది అని తీవ్రంగా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కే. రమణ,జి.ముసలినాయుడు,అప్పలరాజు,జి.దేవుడు,జి.గణేష్,బి నాగేశ్వరరావు, అప్పలరాజు,జిన్నారం కొండ బాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment