విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన...
ప్రత్తిపాడు పెన్ పవర్
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ కు వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ కు మద్దతుగా, ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి, కోర్టు ఆవరణ నుండి మెయిన్ రోడ్ వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగాలని నినాదాలతో నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం ప్రత్తిపాడు- సామర్లకోట రోడ్ లో రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి అడారి సుగుణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, అటువంటి పరిశ్రమను ప్రవేటపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం శోచనీయమని అన్నారు. విశాఖ ఉక్కుని రక్షించకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల అందరూ ఈ ఆందోళనలు బాగస్వాములవుతారని, చెప్పారు.ఈ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ బుగత శివన్నారాయన, అడారి సుగుణ, వెంకటరావు, మధుబాబు, విజయ్ కుమార్, కాళీప్రసాద్, జాన్ బాబు, నర్సింగరావు, చలం, మల్లేశ్వరరావు, నాగేంద్ర, కె శ్రీనివాస్, చిట్టిబాబు, జోగేష్ మరియు రవికుమార్ లు పాల్గొన్నారు.

No comments:
Post a Comment