దరఖాస్తుదారులు ధ్రువీకరణ పత్రాల పరిశీలన
నార్నూర్ , పెన్ పవర్ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం లో మినీ అంగన్వాడీ టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నా దరఖాస్తుదారుల ధ్రువీకరణ పత్రాలను గురువారం ఐసిడిఎస్ కార్యాలయం లో సిడిపిఓ ఉమాదేవి పరిశీలించారు. మొత్తం మండల పరిధిలోని కోసం 94 మంది దరఖాస్తు చేసుకోగా 84 మంది హాజరైనట్లు వారి వారి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వందల కంప్యూటర్ ఆపరేటర్ అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

No comments:
Post a Comment