కరోనా మహమ్మారి తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్
మలిదశ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య శాఖ అధికారి రాథోడ్ నరేందర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మహారాష్ట్ర బార్డర్ ఆనుకొని ఉన్న కొబ్బయి గ్రామన్ని మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఠాక్రె గంబీర్, ఆడానేశ్వర పౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్ తో కలిసి జిల్లా వైద్య శాఖ అధికారి రాథోడ్ నరేందర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పక్క రాష్ట్ర మైన మహారాష్ట్రలో కరుణ కేసులు ఎక్కువ ఉండడంతో మహారాష్ట్ర కు ఆనుకొని ఉన్న గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని తెలిపారు. గ్రామాల్లో పరిస్థితులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు గ్రామంలోని పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పంచయితి సూచించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు తెలిపారు. గ్రామాల్లోని కిరణా షాప్ లోని యజమానులకు కరోనా పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డా. క్రాంతి కుమార్, సాంగిడి ఎంపిటిసి రాకేష్, టిఆర్ఎస్ నాయకులు మహేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment